telugu navyamedia
telugu cinema news trending

“బిగ్ బాస్-4″లో ఈసారి కూడా మహిళా విజేత ఉండకపోవచ్చు : కౌశల్

Kaushal

బిగ్ బాస్ 4 సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది. ఒకానొక సమయంలో బిగ్‌బాస్ షోపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ హౌజ్‌లో క్రమంగా ఇంట్రెస్టింగ్ టాస్కులు, లవ్ స్టోరీలు, గొడవలు, అల్లర్లు, అప్పుడప్పుడు గ్లామర్ షోలతో, ఎమోషన్స్‌తో బిగ్‌బాస్ మళ్లీ ప్రేక్షకులను షో వైపు మరల్చడంలో సక్సెస్ అవుతుంది. సీజన్ 4 లో నటి మోనాల్ తన అందచందాలతో కట్టిపడేస్తూ.. తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ కారణంగానే మోనాల్ ను కావాలనే ఎలిమినేట్ కాకుండా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బిగ్ బాస్ ఎలిమేషన్ ప్రక్రియపై కూడా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కుమార్ సాయి, దివి, దేవి నాగవల్లి ఎలిమినేషన్స్ అన్‌ఫెయిర్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ మండా సీజన్ 4 గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ కంటే రెండో సీజనే బెటర్ అని, ఈసారి అన్నీ కూడా పాత టాస్కులే పెడుతున్నారని, కాస్త కొత్త టాస్కులు పెట్టాలని బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేశారు. ఇక గతంలోని కొన్ని లవ్ ట్రాకులను ఈ సీజన్‌కు కూడా అప్లై చేయాలని చూశారని, అఖిల్-మోనాల్-అభిజిత్ ట్రయాంగిల్ స్టోరీ దానికి నిదర్శనమని అన్నారు. అంతేకాదు ఈసారి సీజన్‌కు కూడా మహిళా విజేత ఉండకపోవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి అభిజిత్, నోయల్, లాస్య, అవినాష్‌తో పాటు అఖిల్ లేదా సోహైల్ టాప్ 5లో ఉంటారని కౌశల్ జోస్యం చెప్పారు. మున్ముందు పరిణామాలు మారే అవకాశాలు లేకపోలేదని తెలిపారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు..

vimala p

నాకు అందమైన మనస్సున్న భర్త దొరికాడు : లీసా రే

vimala p

సల్మాన్, విక్రం సినిమాలకి కరోనా ఎఫెక్ట్

vimala p