telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు…

దశబ్దాలు పోరాడి వచ్చిన తెలంగాణకు ఇటువంటి సీఎం రావటం మన దురదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఓయూలో చదవలేదని భాదగా వుంది..కానీ యూనివర్శిటీ గురించి బాగా చదివానన్నారు. భావ స్వేచ్చ యూనివర్శిటీలో కోరవడింది…మాట్లడితే విద్యార్థులను జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉహించామని..కానీ అటువంటి ప్రయత్నం జరగలేదన్నారు. లక్ష్యాలు మరుగున పడి…పదవులు మాత్రం వచ్చాయని.. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. అక్రమంగా అవినితి డబ్బుతో నాయకులను సీఎం కేసీఆర్‌ కొన్నారని ఆరోపణలు చేశారు. యూనివర్సిటీలకు రావలసిన బడ్జెట్ తగ్గుతూ వస్తుందని..తెలంగాణలో విద్య, వైద్యంలో బడ్జెట్ తగ్గిపోతుందన్నారు. విద్యార్ధులు మరింత పోరాడాలని సూచించారు. ఇంటికో ఉద్యోగం ఏమైంది అని సీఎం కేసిఆర్‌ని నిలదీశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం అన్ని పార్టీలు ఒకటేనని పేర్కొన్నారు.

Related posts