telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బ్యాట్ మెన్” హీరోకు కరోనా ?

Robert

“బ్యాట్ మెన్” చిత్ర టీంలో ఓ కీలక వ్యక్తికి కరోనా సోకడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందని చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ కీలక వ్యక్తి ఎవరనేది తెలియజేయకపోవడం గమనార్హం. దీంతో “బ్యాట్ మెన్” హీరో రాబర్ట్ పాటిసన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న ‘బ్యాట్ మెన్’ చిత్రీకరణను వాయిదా వేశారు.

కాగా గతంలో బ్యాట్‌మ్యాన్‌ సీరీస్‌ చిత్రాల్లో నటించిన బెన్‌ అప్లెక్‌ తప్పుకున్నారు. దాంతో ఈ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్‌ నటిస్తున్నారు. మాట్ రీవ్స్ డైరెక్ట్ చేస్తున్న ‘ద బ్యాట్‌మ్యాన్’ షూటింగ్ ఈ ఏడాది జనవరిలో మొదలైంది. 2021 మధ్యలో సినిమా విడుదల చేసేందుకు చిత్ర టీం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బ్యాట్‌మ్యాన్ ఫ్యాన్స్‌ను అలరించేలా నిర్మాతలు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కరోనా కారణంగా మార్చి నుంచి షూటింగ్ ఆగిపోయింది. తాజాగా చిత్ర టీంలో ఒకరికి కరోనా సోకడంతో సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts