telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

చేపమందుకు .. అంతా సిద్ధం…

bathini brothers fish medicine ready

బత్తిని మృగశిర ట్రస్ట్ పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమై 24 గంటలపాటు పంపిణీ కొనసాగనున్నది. చేప ప్రసాదం పొందేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో ఆస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్థులు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎగ్జిబిషన్ మైదనానికి చేరుకొని చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తున్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. బ్యారికేడ్లు, క్యూలైన్లు, షెడ్ల నిర్మాణం, విద్యుత్ ఫ్లడ్‌లైట్లు బిగింపు వంటి ఏర్పాట్లను సిద్ధంచేశారు. ఉబ్బసం, ఆస్తమా వ్యాధికి ఔషధంగా భావించి దాన్ని పొందేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల నుంచి వ్యాధిగ్రస్థులు వస్తారు.

ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో ఎగ్జిబిషన్ మైదానం పరిసరాలన్నీ నిండిపోయాయి. పలు స్వచ్ఛంద సంస్థలు భోజనం సమకూరుస్తుండగా.. జలమండలి అధికారులు వాటర్ ప్యాకెట్లను అందజేస్తున్నారు.

Related posts