telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అక్కడ బేస్ బాల్ సైజు వడగండ్లు… !!!?

Hailstones

దక్షిణ అమెరికాలో వానలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఎంత భీభత్సముగా అంటే ఆ వానలకు బేస్‌బాల్ సైజు వడగండ్లు కూడా కురుస్తున్నాయట. ఈ భారీ సైజు వడగండ్లు చూసిన అమెరికన్లు ఆశ్చర్యపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ భారీ సైజు వడగండ్ల ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మూడేళ్ల క్రితం టెక్సాస్‌లో కూడా ఇలాంటి వడగండ్లు పడ్డాయని కొంతమంది చెబుతున్నారు. శనివారం ఇంట్లో ఉన్న సమయంలో పైకప్పు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని, బయటకు వెళ్లి చూస్తే లాన్‌లో బేస్‌బాల్ సైజులో ఉన్న వడగండ్లను గమనించినట్టు ఓ అమెరికన్ పోస్ట్ పెట్టాడు. ఇలాంటి వడగండ్ల కారణంగా అనేక చోట్ల భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో బేస్‌బాల్ సైజు వడగండ్లపై కొందరు ఆశ్చర్యపోతుండగా, మరికొందరు మాత్రం ఫన్నీగా స్పందిస్తున్నారు.

Related posts