telugu navyamedia
andhra crime news trending

అధికారుల చేతిలో … బాసర ప్రొఫెసర్ రవి …

basara professor caughted by police

బాసరలోని ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రవి వరాల ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పరారీలో ఉన్న రవి కోసం హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లలో గాలింపు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో తలదాచుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో రవితోపాటు నిందితులుగా వున్న ట్రిపుల్ ఐటీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

దీనిపై ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ.. విద్యార్థినులను వేధించిన రవిపై నిర్భయ, పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో మోర్గే విశ్వనాథ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాధావేది సుధాకర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.3.70 లక్షల నగదు, కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు.

Related posts

ప్రభుత్వ భవనాలకు కొత్త హంగులు..రూపురేఖలు మారనున్న భవనాలు.. సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు

vimala p

ఈసారి కూడా విజృంభించిన .. బ్యాడ్మింటన్ శ్రీకాంత్‌ ..

vimala p

” అమ్మ ఒడి” ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం: రోజా

vimala p