telugu navyamedia
రాజకీయ వార్తలు

నిరసనకారులు సంయమనం పాటించాలి: ఒబామా

obama usa

అమెరికాలోని నల్లజాతి యువకుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల కస్టడీలో మరణించిన తరువాత ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నిరసనకారులు సంయమనం పాటించాలని కోరారు. ఆన్ లైన్ లో నిరసనకారులతో మాట్లాడిన ఆయన, హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయని చెప్పారు.

మీకు సేవ చేసి, మిమ్మల్ని రక్షించాల్సిన వ్యక్తుల నుండే తరచుగా హింస ఎదురుకావడం దురదృష్టకరం అని తెలిపారు.యువత తమ భవిష్యత్తుపై దృష్టిని పెట్టాలని అన్నారు. మీ జీవితాలు ముఖ్యమైనవి, మీ కలలు ముఖ్యమైనవి అని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానని చెప్పారు.

గత కొన్ని వారాలుగా మన జీవితాల్లో ఎన్నో మార్పులను చవిచూశాము. దేశం కూడా మారిపోయింది. కొవిడ్-19 తీసుకువచ్చిన మార్పులను ఆయన ప్రస్తావిస్తూ ఇంతటి మార్పును నా జీవితంలో నేను చూడలేదని అన్నారు. ఓ సమాజంగా దేశంలో వచ్చిన ఈ మార్పు మరింత అభివృద్ధి దిశగా సాగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన ఒబామా, స్థానిక అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని, పోలీసింగ్ విధి విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Related posts