telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ పై అమెరికా మాజీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు…

కాంగ్రెస్ పార్టీకి బీహార్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ బీహార్ లో ఎలాగైనా నిరూపించుకోవాలని అనుకున్న ఆ పార్టీకి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు.  రాహుల్ గాంధీ 8 చోట్ల ప్రచారం నిర్వహించినా ఫలితం లేకపోయింది.  70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం 20 చోట్ల కూడా గెలవలేకపోయింది. ఇదిలా ఉంటె, ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  రాహుల్ గాంధీ నెర్వస్డ్ గా ఉంటారని, ఒక కోర్స్ నేర్చుకునే విద్యార్థి ఎలాగైతే ఉపాధ్యాయుడిని ఆకట్టుకోవడానికి ఆతృతగా ఉంటాడో, రాహుల్ గాంధీ కూడా అలానే కనిపిస్తాడని, కానీ, ఏదైనా విషయాన్ని లోతుగా తెలుసుకునే గుణం, పట్టుదల అతనిలో కనిపించవని ఒబామా తన పుస్తకంలో పేర్కొన్నాడు.  ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. అయితే ఈ బీహార్ ఎన్నికల్లో పోటీచేసిన మహాఘట్ కూటమిలో ఆర్‌జేడీకి 75 సీట్లు, కాంగ్రెస్‌కు 19, మిగిలిన వారికి 16 సీట్లతో మొత్తం ఈ కూటమి 110 సీట్లను సొంతం చేసుకుంది. అలాగే ఎందరో అంచనాలను తప్పని నిరూపిస్తూ ఎన్‌డీఏ విజయం సాధించి తనంటే పడనివారు ముక్కుపై వేలు వేసుకునేలా చేసింది.

Related posts