telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

31న బ్యాంకు ఉద్యోగుల .. సమ్మె బాట..

bank strikes on 22nd october

జనవరి 31, ఫిబ్రవరి 1 వతేదీల్లో వేతన సవరణకు తక్షణ చర్యలు చేపట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నాయి. 9బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBI) ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ ఐక్య వేదికలో అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య(AIBOC), అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(AIBEA) బ్యాంక్ కార్మికుల జాతీయ సంఘం(NOBW) వంటివి ఉన్నాయి. సమస్యల పరిష్కార దిశలో చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదని, దీనితో యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కు తీసుకోలేదని AIBOC ప్రెసిడెంట్ సునీల్ కుమార్ తెలిపారు.

యూనియన్ల నుంచి డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) నుంచి కూడా ఎటువంటి హామీ రాలేదని AIBEA జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్ సమ్మె నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ పెన్షనర్లు అండ్ రిటైరీస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఐదో ద్వైవార్షిక సమావేశం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.

Related posts