telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అలర్ట్ : మార్చిలో బ్యాంకులకు భారీగా సెలవులు..

bank strike

మార్చిలో బ్యాంకు లావాదేవీలు చేసే వారికి షాక్‌ తగలనుంది. ఎందుకంటే మార్చి నెలలో ఏకంగా 8 రోజులు బ్యాంకులకు హాలీ డేస్‌ ఉండనున్నాయి. మార్చిలో వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి నెలలో మొత్తం 31 రోజులు ఉండగా.. అందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు. వీటితో పాటు మహాశివరాత్రి, హోళీ పండుగలు కూడా ఉండటంతో మరో రెండు రోజులు బ్యాంకులకు హాలీ డేస్‌ ఉండనున్నాయి. ఆదివారాలు ఎప్పుడు వచ్చాయే పరిశీలిస్తే.. మార్చి 7, మార్చి 14, మార్చి 21, మార్చి 28 తేదీల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. ఇక మార్చిన 13న రెండో శనివారం, మార్చి 27న నాలుగో శనివారం వచ్చాయి. ఈ రెండు రోజులు కూడా బ్యాంకులకు హాలీ డేస్‌ ఉంటాయి. వీటితో పాటు మార్చి 11న మహాశివరాత్రి, మార్చి 29న తేదీన హోళీ పండగ సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. మార్చి 27 నుంచి 29 వ తేదీ వరకు మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ ఎనిమిది రోజులతో పాటు మరో రెండు రోజులు కూడా బ్యాంకులు మూత పడే అవకాశాలు ఉండే ఉన్నాయి. తొమ్మిది బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్లు మార్చి 15 నుంచి సమ్మెను ప్రకటించాయి. అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

Related posts