telugu navyamedia
news political trending

ఐదు రోజులు బ్యాంకులు మూత..లావాదేవీలు పూర్తి చేసుకోండి

Bank Holidays continue five days

రేపటి నుంచి వచ్చే ఆరు రోజుల వ్యవధిలో బ్యాంకులు ఐదు రోజుల పాటు మూసివేయనున్నారు. ఇందులో నాలుగు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతబడనుండటంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగక తప్పదు.డిసెంబరు 21న ఒక రోజు బ్యాంకు ఆఫీసర్లు సమ్మె చేయనుండటంతో బ్యాంకులు పనిచేయవు. 21 ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్సిడరేషన్ పిలుపు మేర 3.2 లక్షల మంది బ్యాంకు అధికారులు సమ్మె చేయనున్నారు. డిసెంబరు 22వతేదీన నాల్గవ శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు. డిసెంబరు 25వతేదీ క్రిస్మస్ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

డిసెంబరు 24వతేదీన బ్యాంకు తెరచి ఉంచినా, వరుస సెలవులు రావడంతో ఎక్కువ మంది ఉద్యోగులు సెలవులో ఉండటం వల్ల లావాదేవీలు సజావుగా జరగవు.డిసెంబరు 26వతేదీ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపు ఇచ్చినందున బ్యాంకులు ఆ రోజు కూడ పనిచేయవు. అందుకే సంవత్సరాంతంలో ఖాతాదారులు బ్యాంకులకు సెలవులతో ఇబ్బందులు పడకుండా ముందుగానే లావాదేవీలు పూర్తి చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. బ్యాంకులకు వరుస సెలవులతో నగదు కొరత ఏర్పడకుండా ఏటీఎంలలో నగదును నింపాలని బ్యాంకులు నిర్ణయించాయి. 26 నాటి సమ్మె ప్రభావం మాత్రం నామమాత్రంగానే ఉంటుందని బ్యాంకు సంఘాలు అంటున్నాయి.

Related posts

చంద్రగిరిలో గెలవలేక కుప్పం వచ్చారు: వైఎస్ జగన్

vimala p

2 లక్షల కోట్లు దాటేసిన.. ఏపీ బడ్జెట్..

vimala p

పిచ్చి మాటలు మాట్లొడద్దు.. బీజేపీ నేతలకు మధ్యప్రదేశ్ సీఎం సవాల్

vimala p