telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

బ్యాంకు-రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..

govt jobs notifications by ssc and

ఎస్బిఐ దేశవ్యాప్తంగా ఎనమిది వేల క్లరికల్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను అహ్వానిస్తోంది. తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన శాఖల్లోనూ ఈ పోస్టులు వున్నాయి. ఇక హైదరాబాద్ రీజియన్ లో 375 పోస్టులను ఎస్బీఐ బ్యాంకు భర్తీ చేయనుంది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ 2020 జనవరి 26. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేసే విధానం: ఆన్ లైన్ లో.. వెబ్‌సైట్ https://sbi.co.in/
———————————————————-
నార్త్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ సీ పోస్టుల భర్తీకి కేంద్రం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది . మొత్తం 21 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrcald.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు- 21

క్రికెట్- 3
రెజ్లింగ్- 2
బాక్సింగ్- 1
జిమ్నాస్టిక్స్- 2వెయిట్ లిఫ్టింగ్- 3
పవర్ లిఫ్టింగ్- 1
బ్యాడ్మింటన్- 1
ఫుట్ బాల్-1
అథ్లెటిక్స్- 3
హాకీ- 3
టేబుల్ టెన్నిస్- 1
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 20
విద్యార్హత- ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష. టెక్నికల్ పోస్టులకు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు.

Related posts