telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంకర్ ప్రదీప్ రెండ్రోజులు జైల్లో… యువతిని వేధించి… !?

Pradeep

టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజుపై షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన సునిషిత్ అనే దర్శకుడు. అంతేకాదు ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఓసారి ప్రదీప్ ఓ యువతిని వేధించాడని, దాంతో పోలీసులు అతన్ని రెండు రోజుల పాటు జైల్లో పెట్టారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రదీప్ నటిస్తున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా తెరకెక్కిస్తున్న సినిమా అని అంటున్నారు. వెంటనే ఈ సినిమా షూటింగ్ ఆపి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు కూడా నిబంధనలు అతిక్రమిస్తున్నారని పేర్కొన్నారు. గతంలోనూ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్‌‌లో పోలీసులకు దొరకడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రదీప్ రెండు రోజుల పాటు జైల్లో ఉండటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ప్రదీప్ నటిస్తున్న ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే పాటను నిన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్ అవుతోంది. మరి ఈ విషయంపై ప్రదీప్ ఎలా స్పందిస్తాడో…?

Related posts