telugu navyamedia
news sports trending

స్లో ఓవర్ రేట్ తో .. బంగ్లాదేశ్‌ కు తప్పని తిప్పలు .. భారీ జరిమానా ..

bangladesh punished for slow over rate bangladesh punished for slow over rate

కొలంబో వేదికగా తొలి వన్డేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 91 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌ టీమ్‌కి మరో షాక్ తగిలింది. ‘స్లో ఓవర్ రేట్’ తప్పిదం కింద ఆ జట్టుకి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ మ్యాచ్‌ ఫీజులో 20 శాతం, జట్టులోని ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత పడింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. కుశాల్ పెరీరా (111: 99 బంతుల్లో 17×4, 1×6) శతకం బాదడంతో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఛేదనలో ముష్ఫికర్ రహీమ్ (67: 86 బంతుల్లో 5×4), షబ్బీర్ రెహ్మాన్ (60: 56 బంతుల్లో 7×4) అర్ధశతకాలు బాదడంతో గెలిచేలా కనిపించిన బంగ్లాదేశ్.. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు చేజార్చుకుని ఆఖరికి 41.1 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది.

Related posts

జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. ఘాటుగా స్పందించిన పవన్

vimala p

ఎల్.ఐ.సి లో .. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ …

vimala p

అల వైకుంఠపురములో .. మొదటి లిరికల్ వీడియో..

vimala p