telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : హైదరాబాద్ అవకాశాన్ని .. లాగేసిన .. బెంగుళూరు..

bangalore won on hyderabad in ipl 2019 match

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో మ్యాచ్‌లో బెంగుళూరు హైదరాబాద్ పై విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ ఆశల్ని గల్లంతు చేసింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు నష్టపోయి సునాయసంగా ఛేదించింది. వెస్టిండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ హెట్‌మైయిర్‌ (75; 47 బంతుల్లో 4×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగాడు. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా గురుకీరత్‌ సింగ్‌ మన్‌ (65; 48 బంతుల్లో 8×4, 1×6) అజేయ అర్ధశతకంతో మెరిశాడు. సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఛేదన ఆరంభంలోనే బెంగళూరు 3 వికెట్లు చేజార్చుకుంది.

ఆరంభంలోనే తడబడుతూ ఆడినా, బెంగళూరు తొలి ఓవర్‌లో పార్థివ్‌ (0), రెండో ఓవర్‌లో విరాట్‌ కోహ్లీ (16; 7 బంతుల్లో 2×4, 1×6), మూడో ఓవర్‌లో ఏబీ డివిలియర్స్‌ (1; 2 బంతుల్ల6) పెవిలియన్‌ చేరారు. ఈ క్రమంలో హెట్‌మైయిర్‌, గురుకీరత్‌ నాలుగో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లోనే నాలుగో వికెట్‌కు ఇది అత్యధిక భాగస్వామ్యం. నాలుగు పరుగుల వ్యవధిలో హెట్‌మైయిర్‌, గురుకీరత్‌, సుందర్‌ ఔటవ్వడంతో మ్యాచ్‌ కాస్త ఉత్కంఠకరంగా మారింది. చివరి ఓవర్‌లో రెండు బౌండరీలు బాది ఉమేశ్‌ జట్టును గెలిపించాడు. ఖలీల్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌, విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశారు.

సన్‌రైజర్స్‌లో సారథి కేన్‌ విలియమ్సన్‌ (70*; 43 బంతుల్లో 5×4, 4×6) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 50 పరుగుల వరకు ఆచితూచి ఆడిన అతడు చివరి ఓవర్‌లో చెలరేగి భారీ సిక్సర్లు, బౌండరీలతో జట్టు స్కోరును 170 దాటించాడు. ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌ (30; 23 బంతుల్లో 2×4, 2×6), వృద్ధిమాన్‌ సాహా (20; 11 బంతుల్లో 4×4), విజయ్‌ శంకర్‌ (27; 18 బంతుల్లో 3×6) మెరిశారు.

bangalore won on hyderabad in ipl 2019 matchనేటి మ్యాచ్ లు : పంజాబ్ vs చెన్నై సాయంత్రం 4 గంటలకు; ముంబై vs కలకత్తా రాత్రి 8 గంటలకు జరగనున్నాయి.

Related posts