telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బందోబస్త్” మా వ్యూ

Bandobast

బ్యానర్ : లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు : సూర్య‌, మోహ‌న్‌లాల్‌, ఆర్య‌, స‌యేషా సైగ‌ల్‌, స‌ముద్ర‌ఖ‌ని, పూర్ణ‌, నాగినీడు త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : కె.వి.ఆనంద్‌
ఎడిట‌ర్‌ : ఆంటోని
స్టంట్స్‌ : దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌, పీట‌ర్ హెయిన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ : ఎం.ఎస్‌.ప్ర‌భు
సంగీతం : హేరీష్ జైరాజ్‌
నిర్మాత‌ : సుభాస్క‌ర‌న్‌

తమిళ స్టార్ హీరోలు సూర్య, ఆర్య, తమిళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్, డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తమిళ సినిమా ‘కప్పాన్’కు తెలుగు అనువాదమిది. కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో “వీడొక్క‌డే”, “బ్ర‌ద‌ర్స్” చిత్రాలు చేశారు. తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. గతకొంతకాలంగా సూర్యకు సరైన హిట్ లేదు. తెలుగులో అయితే “సింగం” తరువాత సూర్యకు మరో హిట్ పడలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు సూర్య. మరి ఈ సినిమాతో సూర్య తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ దగ్గరయ్యాడా ? లేదా ? చూద్దాం.

కథ :
మిల‌ట‌రీ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ ర‌వికాంత్‌ (సూర్య‌) ప్ర‌ధానమంత్రి చంద్ర‌కాంత్‌ (మోహ‌న్‌లాల్‌)ని కాపాడే మిష‌న్ మీద లండ‌న్ చేరుకుంటాడు. అయితే ప్ర‌ధాని పి.ఎ అంజ‌లి (స‌యేషా సైగ‌ల్‌) ర‌వికాంత్ ప్రధానిని చంప‌డానికి వ‌చ్చిన టెర్ర‌రిస్ట్ అనుకుంటుంది. నిజం తెలిశాక అత‌న్ని ప్రేమిస్తుంది. ప్రధానమంత్రి చంద్ర‌కాంత్‌కి రవికాంత్ న‌చ్చ‌డంతో అత‌న్ని త‌న ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా నియ‌మించుకుంటాడు. అప్ప‌టికే ర‌వి టీమ్‌తో ఉన్న జోసెఫ్ (స‌ముద్ర‌ఖ‌ని) ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా ఉంటాడు. ప్ర‌ధానమంత్రి చంద్రకాంత్‌ని కాశ్మీర్‌లో ఓ టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ ద్వారా చంపేస్తాడు. చంద్ర‌కాంత్ స్థానంలో ఆయ‌న కుమారుడు అభిషేక్‌ (ఆర్య‌) ప్ర‌ధానమంత్రి అవుతాడు. అభిషేక్ కు ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం ఉండ‌దు. రవికాంత్ నే ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా నియ‌మించుకుంటాడు. మ‌హ‌దేవ్ కంపెనీస్ అధినేత మ‌హ‌దేవ్‌ (బోమ‌న్ ఇరాని) గ్యాస్ కోసం గోదావ‌రి జిల్లాల‌లోని పంట భూమినంతంటినీ నాశ‌నం చేస్తుంటాడు. అయితే మ‌హ‌దేవ్ మైనింగ్ ప‌నుల‌కు అభిషేక్ అడ్డుచెబుతాడు. అప్పుడు మహాదేవ్ ఏం చేస్తాడు ? అభిషేక్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు ? అసలు ప్రధానిని చంపించింది ఎవరు ? వారి ప్లాన్ ఏంటి ? అసలు నిజం ఏంటి ? చివరకు ఏమవుతుంది ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
సినిమాలో ఉన్న ముగ్గురు ప్రధాన నటుల నటన గురించి అందరికి తెలిసిందే. సూర్య ఎన్‌.ఎస్‌.జి క‌మాండో ర‌వి పాత్ర‌లో ఒదిగిపోయారు. లుక్, ఫిజిక్, యాక్ష‌న్ పార్ట్‌లో సూర్య ఆకట్టుకుంటాడు.ఇక మోహ‌న్‌లాల్ ప్ర‌ధాని పాత్ర‌లో హుందాగా క‌నిపించారు. ఇక ఆర్య పాత్ర సెకండాఫ్‌లో ప్ర‌ధానంగా సాగుతుంది. స‌యేషా సైగ‌ల్ పాత్ర చాలా ప‌రిమితంగా ఉంది. పాట‌లు, రెండు, మూడు ల‌వ్ సీన్స్‌కే ప‌రిమిత‌మైంది. స‌ముద్ర‌ఖ‌ని, పూర్ణ ఇత‌ర పాత్ర‌ధారులు వారి పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శ‌కుడు కె.వి.ఆనంద్ ఇదివరకులా డిఫ‌రెంట్ ఫార్మేట్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. అయితే ఈ సినిమా సెకండాఫ్‌, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ అన్నీ తేలిపోయాయి అన్పిస్తుంది. ల‌వ్ ట్రాక్ బోరింగ్ గా ఉంది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఎం.ఎస్‌.ప్ర‌భు కెమెరా ప‌నితనం బాగానే ఉంది. సినిమాలో కామెడి, ఎంట‌ర్ టైన్‌మెంట్ ఎక్కడా కన్పించదు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

రేటింగ్ : 2.5/5

Related posts