telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

‘బందోబస్తు’ .. శిరీష్ వేటలో సూర్య..

Bandobasth

సూర్య హీరోగా నటించిన బందోబస్త్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో ఆర్య ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. వాస్తవంగా ఆ పాత్రను అల్లు శిరీష్ చేయాలని ఫిక్సైయ్యాక సడన్ గా డ్రాపయ్యాడు. కానీ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేక తను బందోబస్త్ నుంచి తప్పుకుంటున్నట్టు గతంలో ప్రకటించుకున్నాడు శిరీష్. ఇప్పుడదే అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి శిరీష్ తప్పుకునే అంశంపై స్వయంగా సూర్య స్పందించాల్సి వచ్చింది. కానీ ఏం చెప్పాలో అర్థంకాక చాలా తికమకపడ్డాడు సూర్య. బందోబస్త్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన సూర్య, అల్లు శిరీష్ తప్పుకున్న అంశంపై సూటిగా స్పందించలేకపోయాడు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. కొన్ని పేపర్ ఇష్యూస్ వల్ల, ఆఖరి నిమిషంలో మార్పుచేర్పుల వల్ల శిరీష్ ఈ సినిమా చేయలేకపోయాడని చెప్పాడు. ఇదే కాదు మరికొన్ని సమస్యలు కూడా ఎదురవడంతో శిరీష్ డ్రాపయ్యాడని అన్నారు. కానీ ఈ విషయం నమ్మశక్యంగా లేదని స్పష్టంగా తెలుస్తోంది.

ఇంతకముందు చెప్పినట్టు అల్లు శిరీష్ కాల్షీట్ల సమస్య వల్లనే ఈ సినిమాలో నటించలేకపోయాడని సూర్య చెబితే సరిపోయేదేమో. కానీ పేపర్ ఇష్యూస్, ఆఖరి నిమిషంలో మార్పు చేర్పులు అంటూ ఏదేదో మాట్లాడి ఇరుకునపడ్డాడు. నిజానికి ఈ ప్రాజెక్ట్ నుంచి శిరీష్ తప్పుకోలేదు. యూనిట్ సభ్యులే అతడ్ని తప్పించారని మన తెలుగు ఇండస్ట్రీ టాక్. నిజానికి ఆ టైమ్ లో శిరీష్ ఏమంత బిజీగా కూడా లేడన్నది కూడా వాస్తవం. బందోబస్త్ సినిమాలో సాయేషా హీరోయిన్ గా నటించిందన్న సంగతి తెలిసిన విషయం. అయితే తన రికమండేషన్ తోనే ఆర్యను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారట. దీంతో అల్లు శిరీష్ తప్పుకోవాల్సి వచ్చిందనేది ఇన్ సైడ్ టాక్. ఇక ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి వస్తోంది.

Related posts