telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నన్ను .. బండ్ల గణేష్.. అనే పిలవండి ప్లీజ్..

bandlaganesh request on movie event

ఎల్బీ స్టేడియంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది.

బండ్ల గణేష్ మాట్లాడుతూ..మెగాస్టార్ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచంలో ఎవరైనా, ఏ మనిషైనా, నేను, నా కొడుకు, నా వాళ్లు బాగుండాలని కోరుకుంటారు. అది సర్వసాధారణం. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఓ సూపర్ స్టార్ సినిమా బాగుండాలని, రికార్డులు క్రియేట్ చేయాలిన ఆశీర్వదించడానికి వచ్చిన మెగాస్టార్ సంస్కారానికి నా పాదాభివందనం. నన్ను బ్లేడ్ గణేష్ అనొద్దు.. బండ్ల గణేష్ అని పిలవండి. అందరూ యెర్రి డ్యాష్ అని పిలుస్తున్నారు.. కాబట్టి ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను.. అమ్మతోడు ఇక సినిమాలు తప్పా ఇంకేమీ చేయను. ముప్పై యేళ్లు ఉన్నాను.. ఇంకో ముప్పై యేళ్లు ఇక్కడే ఉంటాను. అమ్మతోడు సినిమాలు తప్పా ఇంకేమీ చేయను. నాకు ఇంకేమీ సంబంధం లేదు. ఇంకా వేరే ఏ పని చేయన’ని చెప్పుకొచ్చాడు.

Related posts