Trending Today రాజకీయ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

అది సినిమా అభిమానం…ఇది రాజకీయ అభిమానం…బండ్లగణేష్..గూఢచారి..

bandlaganesh joined in congress with his interestf

తాజాగా ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే స్వతహాగా గణేష్ పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహిత అభిమానులలో ఒకడు. అందువల్లనే గణేష్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోనే ఖచ్చితంగా చేరే అవకాశం ఉన్నాడని భావించారు అందరూ. కానీ ఈ అంచనాలను ఆశ్చర్యంగా తలక్రిందులు చేశాడు గణేష్. ఏఐసీసీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నాడు. అయితే తాను జనసేనలో ఎందుకు చేరలేదనే ప్రశ్న ఉదయించడం చాలా సహజం. దానికి సమాధానం ముందుగానే నిర్వచించుకోకుండా అయితే గణేష్ కాంగ్రెస్ లోకి వెళ్ళేఅవకాశం అయితే లేదు.

అందుకే ముందుగానే తన జవాబు సిద్ధం చేసుకొని, కాంగ్రెస్ లో చేరాడు. ఇక ఆ సమాధానంగా ఏమి చెప్పబోతున్నాడు.. అన్నది కూడా పెద్ద రహస్యం ఏమి కాదు…తనకు చిన్నప్పటి నుండి కాంగ్రెస్ అంటే అభిమానం అని, కానీ పవన్ కళ్యాణ్ కూడా సినిమా ప్రపంచంలో నాకు దేవుడు అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి నేను ఏమి చెప్పలేను గాని ఆయనే నాకు తండ్రి, దైవం. నాకు సినిమాల ఫై ఉన్న అభిమానం వేరు, రాజకీయంగా ఉన్న అభిమానం వేరు. అందుకే కాంగ్రెస్ లో చేరాను, సినిమాలు అంటే అభిమానం ఉందని జనసేనలో చేరలేను కదా.. అన్నాడు.

bandlaganesh joined in congress with his interestfమొత్తానికి గణేష్ ఒక కండువా వాడు అయ్యాడు. కానీ దీనిని బయట వర్గాలు మరో రకంగా కూడా అంటున్నాయి. ప్రస్తుతం బోలెడన్ని కేసులు గణేష్ పై ఉన్నాయని, వాటినుండి తప్పించుకునేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకోని ఉంటాడని అంటున్నారు. గణేష్ దీనికి కూడా సమాధానం చెప్పాడు… తాను కేసుల నుండి తప్పించుకోవాలి అనుకుంటే అధికార పార్టీలో చేరతాను గాని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ లో ఎందుకు చేరుతాను అని అన్నాడు. ఇక ఈ చేరిక పై మరో కోణం కూడా బయటకు వస్తుంది. జనసేన గూఢచారిగా గణేష్ కాంగ్రెస్ లో చేరారు అని లేదా కాంగ్రెస్ తో పొత్తుకు ఇది ముందస్తు ఏర్పాటు అని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

చిరు, కొరటాల శివ టైటిల్ ఖరారు ?

vimala t

దేశమంతా ఆగ్రహంతో ఉంది : రాహుల్

admin

దేశం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను: పరిపూర్ణానంద స్వామి

madhu

Leave a Comment