telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు : బండ్ల గణేష్

bandla ganesh in bigg boss 3 conditions apply

న‌టుడిగా, నిర్మాత‌గా తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన బండ్ల గ‌ణేష్‌ను జంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి బుధ‌వారం నాడు అదుపులోకి తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ముంబైకి చెందిన ఫైనాన్సియ‌ర్‌ను మోసం చేశాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో బండ్ల‌గ‌ణేష్‌పై ముంబై కోర్టులో కేసు న‌మోదైంది. కేసును పరిశీలించిన ముంబై కోర్టు వారెంట్‌ను ఇష్యూ చేసింది. దీంతో బంజారా హిల్స్ పోలీసులు బండ్ల గణేష్‌ని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. అయితే తనను ఎవరూ అరెస్ట్ చేయలేదు అంటూ బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు.. విచారణ కోసం పిలవడం జరిగింది.. చట్టం పై గౌరవంతో వాళ్లు సహకరిస్తున్నారు.. నన్ను అరెస్టు చేస్తే నేను మీకు తెలియజేస్తాను మీ బండ్ల గణేష్’’ అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Related posts