టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టెస్టు రిజల్ట్స్ లో తనకు కరోనా తగ్గిపోయిందన్న విషయం వెల్లడి కావడంతో థాంక్స్ గాడ్ అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ సందర్భంగా అపోలో డయోగ్నోస్టిక్స్‌లో కరోనా నిర్దారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌ను కూడా షేర్ చేశారు.
కాగా, ఇటీవల బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు ఆందోళన చెందారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో బండ్ల గణేశ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. రిపోర్ట్ లో కరోనా తగ్గినట్టుగా తేలింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.