telugu navyamedia
సినిమా వార్తలు

నరేష్ గారు ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్: బండ్ల గణేష్‌

హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై నరేష్ స్పందనను నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తప్పుపట్టారు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్ అన్నారు. తాజాగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

‘‘సాయిధరమ్ తేజ్‌గారు షూటింగ్స్ చేస్తారు.. బ్రహ్మాండంగా ఉంటారు.. అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రమాదం జరిగింది. ఈ టైమ్‌లో నరేష్ గారు.. మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తూ మరణించిన వారి పేర్లు చెప్పడం కానీ, మీరట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడెందుకు సార్. రేసింగ్ చేశాడు.. అది చేశాడు, ఇది చేశాడు. మీ ఇంటి దగ్గరకు వచ్చాడు.. ఎందుకు ఇవన్నీ చెప్పండి. తప్పు కదా సార్.

ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి త్వరగా కోలుకోవాలి.. సాయిధరమ్ తేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి గానీ, ఇట్లాంటవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్. మీ అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. సాయిధరమ్ తేజ్, భగవంతుడి ఆశీస్సులతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బ్రహ్మాండంగా ఉంటుంది.. థ్యాంక్యూ’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Related posts