telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కట్టింగ్ చేస్తున్న బండ్ల గణేష్.. ఫోటోస్ వీరల్

2019 ఎన్నికల ముందు వరకు బండ్ల గణేష్ రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అప్పటినుండి ఆయన కనీసం అటువైపు చూడను కూడా చూడలేదు. ఈ మధ్య వకీల్ సాబ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ మెరిశాడు. అయితే బండ్ల గణేశ్ మంచి నటుడు, నిర్మాతే కాదు… తల్లిదండ్రులంటే ఎంతో అభిమానం ఉన్న కొడుకు కూడా! కరోనా కారణంగా గత యేడాది చాలామంది గడ్డాలూ మీసాలు పెంచేశారు. కారణం సెలూన్ కు వెళ్ళి కటింగ్ చేయించుకుంటే ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయం. అయితే…. కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో కత్తెర చేతపట్టి, ఇంట్లో అయిన వాళ్ళకు హెయిర్ కటింగ్ చేశారు. తాజాగా ఇదే పని బండ్ల గణేశ్ కూడా చేశాడు. ‘కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను’ అంటూ తన తండ్రికి జుత్తు కత్తిరిస్తున్న వీడియోను గణేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

Related posts