telugu navyamedia
సినిమా వార్తలు

‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశ్ ఫస్ట్‌లుక్‌

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమాకి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఫిక్స్‌ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్టులుక్ ను రిలీజ్‌ చేశారు. అందులో కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖాన్ని కవర్ చేస్తూ కంటిపై కత్తిగాటు, దానికి వేసిన కుట్లు… ఆ గాయం నుండి కారుతున్న రక్తం సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ టైటిల్ పోస్టర్ ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.

వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తమిళంలో హిట్ అయిన ‘ఓత్త సెరుప్పు సైజ్ 7’కి‌ రీమేక్ ఇది. తమిళంలో పార్తిబన్ చేసిన పాత్రను బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం పత్యేకంగా మేకోవర్ అయ్యాడు గణేశ్. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు దర్శకనిర్మాతలు.

Related posts