telugu navyamedia
సినిమా వార్తలు

“సరిలేరు నీకెవ్వరు” సెట్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్

Bandla-Ganesh

“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వ‌రు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర‌, దిల్‌రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది.

కాగా ఈ సినిమాలో నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ ఒక ఫన్నీ క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బండ్ల గణేష్ నటించే క్యారెక్టర్ షూటింగ్ నేటి నుండి మొదలెట్టామని “సరిలేరు నీకెవ్వరు” యూనిట్ నుండి కాసేపటి క్రితం ఒక ప్రకటన వచ్చింది. గతంలో పలు సినిమాల్లో తన కామెడీ డైలాగ్స్ తో ఆకట్టుకున్న బండ్ల, చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న ఈ సినిమాలో ఎటువంటి ఫన్నీ పాత్రలో నటిస్తున్నారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం రాబోతుండడంతో ఆ రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

Related posts