• Home
  • వార్తలు
  • రాహుల్ సమక్షంలో.. కాంగ్రెస్ లో చేరిన సినీ నిర్మాత
రాజకీయ వార్తలు వార్తలు

రాహుల్ సమక్షంలో.. కాంగ్రెస్ లో చేరిన సినీ నిర్మాత

Bandla Ganesh Joins, Congress, Rahul Gandhi

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ లో చేరారు. ఈ ఉదయం ఆయన న్యూఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్‌ గణేష్‌ కు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బండ్ల గణేష్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు పరిచయం చేయగా, గణేష్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు రాహుల్ తెలిపారు. బండ్ల గణేష్ తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

అనంతరం బండ్ల గణేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ దేశం కోసం ఎంతో త్యాగం చేసిందన్నారు. తనకు కాంగ్రెస్‌ అంటే ఇష్టమని.. అందుకే ఆ పార్టీలో చేరానన్నారు. రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకే పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని కోరితే చేస్తానని.. వద్దంటే ప్రచారం మాత్రమే చేస్తానని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని గణేశ్‌ తెలిపారు. పవన్‌కల్యాణ్‌ తనకు గురువు అని… కానీ చిన్నప్పట్నుంచీ కాంగ్రెస్‌పై ఉన్న ఇష్టంతోనే ఆ పార్టీలో చేరుతున్నానన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలన్నది తన కోరికని బండ్ల గణేశ్‌ స్పష్టం చేశారు.

Related posts

అమర్ నాధ్ యాత్ర తాత్కాలికంగా రద్దు…

chandra sekkhar

కుమారస్వామి వంద రోజుల పాలన పూర్తి…రాహుల్ కు కృతఙ్ఞతలు!

madhu

ప్రకాశం జిల్లాలో తాగునీరు అందిస్తాం : లోకేష్

admin

Leave a Comment