telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కన్నా..కేసీఆర్ పెద్ద ప్రమాద కారి : బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా గెలవాలని అనుకుంటున్నామని…భాగ్యనగరాన్ని పాత బస్తి చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ఫైర్‌ అయ్యారు. బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శిస్తున్న టీఆర్‌ఎస్‌ … ఎంఐఎం చేతిలో కీలుబొమ్మ కాదా అని ప్రశ్నించారు.గత ఓటర్ జాబితాతో పోలిస్తే ఈసారి ఓటర్ జాబితాలో చాలా వ్యత్యాసం ఉందని… హిందువులు ఎక్కువగా ఉన్న డివిజన్ లలో వాళ్ళ ఓట్లు తగ్గించి మైనారిటీ ఓట్లు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 51 వార్డ్ లలో ఓటర్ల సంఖ్య పది శాతం పెరిగిందని.. 63 వార్డుల్లో 5 వేల ఓట్ల వ్యత్యాసం ఉందన్నారు. బీజేపీ కి ఎక్కువ ఓట్లు పడ్డ ప్రాంతాల్లో హిందువుల ఓట్లు తగ్గించారని…బోలక్ పూర్ లో 73 నుండి 92 పోలింగ్ బూత్ లలో ముస్లిం ఓట్ల ను పెంచారని పేర్కొన్నారు.
అంబర్ పేట్ లోనూ ముస్లింల ఓట్లు పెంచారని…ఉప్పుగూడా హిందువుల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఎంఐఎంకి భాగ్యనగరాన్ని అప్పగించడానికి టీఆర్‌ఎస్‌ పన్నిన కుట్రనే ఇది అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ కనుసన్నల్లో ఎన్నికలు జరగాలి అంటే ప్రశాంతంగా ఎలా జరుగుతాయో ఎన్నికల కమిషన్ ఆలోచించాలన్నారు.హైదరాబాద్ ను ఎంఐఎంకి అప్పగించి డల్లాస్, ఇస్తాంబుల్ వెళ్లాలని సీఎం అనుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. వరంగల్ లో వరదలు వచ్చాయని..అక్కడ 10 వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలని… 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటారని సూచించారు. తెలంగాణలో కరోనా కన్నా…సీఎం కేసీఆర్‌ పెద్ద ప్రమాద కారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక లో కచ్చితంగా గెలుస్తున్నామని..ప్రజాస్వామ్యయుతంగా యుద్ధం చేశామన్నారు. నటించే నాయకుల బండారం బయట పెట్టామని తెలిపారు.

Related posts