telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి వారే కారణం…

బీజేపీ నేతలు దీక్షను బీజేపీ కార్యాలయంలో వారికి నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి, సంజయ్ లు దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గ్రేటర్ ఎన్నికలపై చర్చ జరుగుతోందని కానీ సీఎం పోలీసులు ,ఈసీని ఆయన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని అన్నారు. ఈ ఎన్నికలో దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆయన దానికి నిరసనగా బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ లు దీక్షకు దిగారని అన్నారు. పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి సీఎం, పోలీసులు, ఈసీ నే కారణమని ఈ విషయంలో సక్సెస్ అయ్యారని అన్నారు. ఓటింగ్ పెంచాల్సిన వాళ్లే భయబ్రాంతులకు గురి చేశారన్న ఆయన సీఎం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అడ్డదారిలో గెలవాలని చూశారని అన్నారు. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ లో జరగాల్సిన ఎన్నికలు సీఎం కనుసన్నల్లో జరిగాయని, ఈ రోజు ఉదయం నుండి కార్యకర్తల పై దాడులు జరిగాయని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు భయానక పరిస్థితులు సృష్టించాయని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ ని సస్పెండ్ చేయాలని ఈ ఎన్నికల కారణంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయిందని అన్నారు. మేయర్ పదవి బీజేపీ కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేసారు.

Related posts