telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పంట నష్టంపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం..

రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రైతులు ఓవైపు తీవ్రంగా నష్టపోతే, కనీసం పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సాపల్లితో పాటు వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారంలో కంకిదశలో నేలకొరిగి నష్టపోయిన వరి పంటలను పరిశీలించి రైతులతో బండి సంజయ్ మాట్లాడారు. గత ఆరేళ్ల నుంచీ టీఆర్ఎస్ ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారమివ్వకుండా, కమిటీల పేరుతో కాలాయాపన చేస్తోందని నిలదీశారు. కాలం గడుస్తుందే తప్ప, గత కాలపు పంట నష్టం ఇప్పటివరకూ అన్నదాతలకందకపోగా, తాజాగా జరిగిన పంటనష్టంపై కూడా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణా రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయకపోవడం వల్ల ఈ దుస్థితికి ఏర్పడిందని ఫైర్ అయ్యారు. కమిటీల పేరుమీద అంచనాల పేరుమీద కాలయాపన చెయ్యకుండా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి డిమాండ్ చేశారు. తన ఫాంహౌస్ లో భూసార పరీక్షలు చేయించుకుని, తాను మాత్రం దొడ్డు వడ్లు వేసుకున్న సీఎం కేసీఆర్, కేంద్రం 125 కోట్ల రూపాయలను భూసార పరీక్షల కోసం ఇచ్చినా, ఇంకెక్కడా ఇతర రైతుల పొలాల్లో భూసార పరీక్షలు కూడా నిర్వహించకుండా వారిని మాత్రం సన్న వరి వేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వరికి క్వింటాల్ కు ఇప్పుడున్న 1880 రూపాయలతో కలిపి మరో 500 రూపాయలు బోనస్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related posts