telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దేశంలో షెడ్యూల్ ఇవ్వని సీఎం కేసీఆర్ ఒక్కడే…

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. అయితే నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భద్రాచలం సీతారామచంద్రస్వామిని ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.   తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలని భద్రాద్రి రామయ్యను కోరానని తెలిపారు.  రాష్ట్రంలో దేవాలయాల మీద వస్తున్న ఆదాయాలు ఎటుపోతున్నాయో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఫైర్‌ అయ్యారు. దేశంలో షెడ్యూల్ ఇవ్వని ముఖ్యమంత్రి వున్నాడు అంటే అది కేసీఆర్ ఒక్కడేనని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తున్నారని…రాష్ట్రాన్ని పాలించేది, దోచుకునేది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ లోని 500 కోట్ల ప్యాకెజిలో 30 కోట్లు భద్రాద్రి  అభివృద్ధి ఇస్తామని చెప్పినా DPR ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని ఫైర్‌ అయ్యారు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై టీఆరెస్ నేతలు ఎలా స్పందిస్తారు అనేది… అలాగే ఈ ఎన్నికలో ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారు అనేది.

Related posts