telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బిజెపి అంటే కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి : బండి

బిజెపి అంటే కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి.. కేసీఆర్ బాక్సులు బద్ధలవుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దుబ్బాకలో బిజెపి కొట్టిన దెబ్బకు కేసీఆర్ గూబ గుయ్యిమన్నదన్న ఆయన తెలంగాణలో తెరాస గడీల పాలన, రాక్షస పాలన అంతమొందించాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు. కేసీఆర్ కి ఎమ్మెల్సీ అంటే మాస్టర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని అర్థం అని ఆయన అన్నారు. 35 వేల కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు మొదలుపెడితే లక్షకోట్లతో దోచుకునే ప్రాజెక్టు గా మార్చిండు. కమిషన్ ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్ట్ ల పేరుతో మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు కాపలా కుక్కల ఉంటానన్న వ్యక్తి ఇవ్వాళ తెలంగాణకు విశ్వసఘాతకుడిగా మారాడన్న ఆయన సిర్పూర్ కాగజ్ నగర్ లో అభివృద్ధికి ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్రం ఇచ్చే పైసానేనని అన్నారు. సిర్పూర్ అభివృద్ధి కోసం ఎంత నిధులు ఖర్చు చేశారో దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. బిజెపి ఏ మతానికి వ్యతిరేకం కాదు. 80 శాతం ఉన్న హిందువుల కోసం పని చేస్తే, మతతత్వ పార్టీ అనే రంగు పూస్తున్నారని అన్నారు. న్యాయవాది వామన రావ్ దంపతుల జంట హత్యల కేసులో ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయం..వెంటనే సీఎం స్పందించాలని అన్నారు.

Related posts