telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

30 మంది trs ఎమ్మెల్యేలు  మాతో టచ్ లో ఉన్నారు…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని గవర్నర్ కి పిర్యాదు చేశామని.. గ్రేటర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని…. ఎన్నికల సంఘం ప్రభుత్వం దొంగ నాటకం అడుతున్నాయని గవర్నర్ కి తెలిపామన్నారు. ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని… ఒవైసి, కేసీఆర్ కలిసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారన్నారు. ప్రజా తీర్పుని ఎన్నికల కమిషన్, ప్రభుత్వం అవమానిస్తుందని… గ్రేటర్ లు పోలింగ్ బూత్ లు కాప్చర్ చేశారని ఫైర్‌ అయ్యారు. Mim మద్దతు లేకుంటే trs ఇన్ని సీట్లు కూడా గెలవకపోవని… కొత్త కౌన్సిల్ కి 3 నెలల టైమ్ ఉంటే ముందే ఎందుకు ఎన్నికలు నిర్వహించారో పిచ్చికూతలు కూస్తున్న trs నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిగ్గులేకుండా మంత్రుల ప్రారంభోత్సవాలకు మాజీ కార్పొరేటర్ లతో పాల్గొంటున్నారని…అంతేకాదు గుంట నక్కల లాగా దోచుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, 30 మంది trs ఎమ్మెల్యేలు  మాతో టచ్ లో ఉన్నారని… కేంద్ర పథకాల పట్ల సీఎం కనువిప్పు కలగడం సంతోషమన్నారు. మా లైన్ క్లియర్ 2023 లో ప్రజల ఆశీర్వాదం తో అధికారం లోకి రావడమే లక్ష్యం….ఏ పార్టీ తో కలిసేది లేదని స్పష్టం చేశారు.

Related posts