telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వ‌ర‌ద‌లతో మృతిచెందిన వారికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి

BJP Bandi sanjay

వ‌ర‌ద‌ల కార‌ణంగా మృతిచెందిన వారందరికీ రూ. 20 లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని.. పంట నష్టపోయిన రైతులందరిని ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బైరామల్ గూడ చెరువు ప్రస్తుతం 2 ఎకరాలు ఉందని.. అధికార టీఆర్ఎస్ కు చెందిన కొంతమంది గుంటనక్కలు చెరువుల ఆక్రమణలకు పాల్పడడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. గత ఆరేళ్లలో హైదరాబాద్ లో వందలాది చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. దీని పర్యవసానమే భారీ వరదలు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఫైర్ అయ్యారు. ఆక్రమణలకు గురైన చెరువుల గురించి టీఆర్ఎస్ సర్కారు కనీసం ఆలోచించడం లేదని… అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమార్కులు పేద ప్రజల ఉసురుపోసుకుంటున్నరు. చెరువులను కబ్జాచేసిన గుంటనక్కలెవరో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరదలను ఎదుర్కొనే కార్యాచరణ కూడా చేపట్టకపోవడం సిగ్గుచేటు. వరదలతో నిరాశ్రయులై ఆదుకొమ్మని అడిగిన దళితులపై పోలీసులను ఎగదోస్తారా..? ఇదేం తీరని ప్రశ్నిస్తే అమానుషంగా దాడి చేస్తారా..? అని నిలదీశారు. దళితులపై, బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Related posts