telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉత్తరాంధ్రవాసుల భుజంపై తుపాకీ పెట్టి, అమరావతిని చంపేస్తారా? : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి

Bandaru-Satyanarayana

• ఎదుటివారి పొట్టగొట్టి, తమ కడుపు నింపుకునేంత దుర్మార్గులు కారు ఉత్తరాంధ్ర వాసులు.
• వారు కోరుకునేది తమ ప్రాంత అభివృద్ధిని, తమ యువతకు ఉద్యోగావకాశాలను తప్ప, వేరేప్రాంత నాశనాన్ని కాదు.
• ముగ్గురు బీజేపీనేతలు జగన్ కు అమ్ముడు పోయి, మోదీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చూడలేని, జగన్, ఆయన మంత్రులు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు టీడీపీ ప్రభుత్వం చేసిన మంచిని చూడలేని దుస్థితిలో ఉన్నారని టీడీపీనేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. సోమవారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం విశాఖకు తీసుకొచ్చిన లులూ గ్రూప్, ఆదానీ సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సహా, ఇతర పరిశ్రమలను తరిమేసింది ఎవరో ఉత్తరాంధ్ర మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. ఆదానీ డేటా సెంటర్ వచ్చిఉంటే ఎంతమందికి ఉపాధి లభించిఉండేదో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉండుంటే, ఎన్నివేల ఐటీ ఉద్యోగాలు లభించేవో చెప్పాల్సిన పనిలేదన్నారు. ఉత్తరాంధ్రపై జగన్ కు ఉన్నది నిజమైన ప్రేమ అయితే, తిత్లీ, హుద్ హుద్ వచ్చినప్పుడు కన్నెత్తైనా ఎందుకు చూడలేదని బండారు నిలదీశారు. అమరావతి రైతుల పొట్టగొట్టి, తమ కడుపు నింపుకునేంత దుర్మార్గులు ఉత్తరాంధ్రవాసులు కారన్నారు. ఉత్తరాంధ్రకు కేంద్రం నుంచి రావాల్సిన వెనకపడినప్రాంత నిధులు, రైల్వేజోన్, ప్రత్యేకహోదా గురించి జగన్ గానీ, ఆయన ఎంపీలుగానీ, విజయసాయి గానీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని చంద్రబాబు ప్రారంభిస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక ఆప్రాజెక్టుకు రూపాయి కూడా కేటాయించలేదన్నారు. వై.ఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా చంద్రబాబు పూర్తిచేశాడని, ఏషియన్ పెయింట్స్, కోకాకోలా, భోగాపురం ఎయిర్ పోర్టు తీసుకొచ్చింది, పెట్రో యూనివర్శిటీ, గిరిజన యూనివర్శిటీ, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీలను ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ఈవిధంగా ఉత్తరాంధ్రకు మేలు చేసింది, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబయితే, జగన్ ఇప్పుడు తనస్వార్థంకోసం ఉత్తరాంధ్రపై కపటప్రేమ చూపుతున్నాడని సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. జగన్ కు, ఉత్తరాంధ్ర మంత్రులు బొత్స, ధర్మాన, అవంతిలకు తమ ప్రాంతంపై నిజంగా ప్రేమాభిమానాలుంటే, పోయిన పరిశ్రమలను వెనక్కు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో ఉత్తరాంధ్రకు మేలుచేస్తున్నామని చెబుతున్న జగన్, ఆయన మంత్రులు, ఆప్రాంతవాసుల భుజంపై తుపాకీ పెట్టి, అమరావతిని చంపాలని చూడటం దుర్మార్గమని బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ వచ్చాక విశాఖ సహా, ఉత్తరాంధ్రకు అన్నీ చెడుశకునాలే జరుగుతున్నాయని, విశాఖలో భూములవిలువ ఎక్కువుంది కాబట్టే, దానిపై కన్నేశారన్నారు. కేసీఆర్ తో తనకు స్నేహం ఉంది కాబట్టి, హైదరాబాద్ ను వదిలేసి, రాయలసీమకుచెందిన కొందరు ఫ్యాక్షనిస్టులను విశాఖపై పడేలా జగన్ చేశాడన్నారు. కేవలం అమరావతి రైతులను నాశనం చేయడానికే, జగన్ విశాఖలో రాజధాని అంటున్నాడు తప్ప, ఉత్తరాంధ్రపై ప్రేమతో కాదన్నారు. జగన్ కు కావాల్సింది పారిశ్రామికవేత్తలు, దోపిడీదారులు, దళారులు తప్ప రైతులు కాదన్నారు. దేశంలో ఎక్కడైనా మూడు రాజధానులున్నాయా అని ప్రశ్నించిన సత్యనారాయణమూర్తి, జగన్మోహన్ రెడ్డి తెలివితేటలేమిటో, ఆయన గొప్పతనం ఏమిటో ఆయన గతచరిత్రే చెబుతోందన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ ను విశాఖలో పెట్టడాన్ని ఎవరూ ఒప్పుకోరని, చంద్రబాబు తీసుకొచ్చిన పరిశ్రమలను తిరిగి విశాఖసహా, ఉత్తరాంధ్రలో నెలకొల్పాలని బండారు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పనితనం వల్లే, విశాఖకు లులూ గ్రూప్, ఆదానీ సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఏషియన్ పెయింట్స్, కోకాకోలా, గిరిజన, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీలు వచ్చాయన్నారు. జగన్ అధికాంరలోకి వచ్చింది మొదలు పబ్జీ తో పాటు, ఉత్తరాంధ్రవాసులతో ఆడుకుంటున్నాడన్నారు. తుగ్లక్, హిట్లర్, వంటిపేర్లతో పాటు దుర్మార్గమైన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తాడని, అటువంటి జగన్ ను నమ్మే స్థితిలో ఉత్తరాంధ్ర వాసులు లేరన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉత్తరాంధ్రకు తిరిగి మంచి రోజులు వస్తాయని, ఆప్రాంత వాసులు విశ్వసిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబునే కలకాలం గుర్తుంచుకుంటారన్నారు. బీజేపీలోని కొందరు నేతలు, జగన్ కు అమ్ముడుపోయి, రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేయడానికి సిద్ధపడ్డారన్నారు. ఆపార్టీకి చెందిన ముగ్గురు ప్రధాన నాయకులు జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ, మోదీ, షాలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని బండారు మండిపడ్డారు. జగన్ గుట్టుమట్లన్నీ మోదీ చేతుల్లో ఉన్నందున, ఆయనే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక చర్యలను కట్టడి చేయాలన్నారు.

Related posts