telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

చలిలో రాత్రి .. అరటిపండు తినకూడదంట..

banana taking at night in cold season not good

అరటి పండు అన్ని సీజన్స్ లో దొరుకుతుంది. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి సీజన్స్‌లోనూ దొరుకుతాయి. వాటిలో అరటిపండు ఒకటి. అరటి పండు ద్వారా చాలా లాభాలుంటాని మనందరికీ తెలిసిందే. చాలా మంది అన్నం తిన్న తర్వాత అరటిపండు తింటూ ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదే. దీని వల్ల బాడీకి కావాల్సిన ఐరన్ అందుతుంది. అరటి పండులో విటమిన్స్,మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. ఒక అరటిపండు తింటే 3 గ్రాముల ఫైబర్‌, 100 క్యాలరీలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి అరటిపండు మంచి స్నాక్‌. అరటిపండు తింటే తొందరగా ఆకలి వేయదు.

రోజులో అవసరమైన 12 శాతం ఫైబర్‌ అరటిపండు తినడం వల్ల లభిస్తుంది. అరటిపండులో వుండే పొటాషియం కారణంగా శరీరంలో బ్లడ్ ప్రెషర్ అదుపులో వుంటుందంటున్నారు పరిశోధకులు. అంతేకాదు.. అధిక రక్తపోటుని కూడా నిరోధించడానికి ఈ అరటిపండు మేలు చేస్తుందట. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. చలికాలంలో మాత్రం రాత్రి పూట అరటిపండ్లను తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే.. ఆయుర్వేద ప్రకారం.. చలికాలంలో రాత్రి పూట అరటి పండ్లను తినడం వల్ల మన శరీరంలో జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలు ఇది వరకే ఉన్నవారికైతే మరింత ఇబ్బంది కలుగుతుందట.

Related posts