telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బండి సంజయ్ ఓ కొత్త బిచ్చగాడు : బాల్కసుమన్

Balka suman trs

ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడింది మేమేనని..బీజేపీ 12 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టిందని మండిపడ్డారు బాల్క సుమన్‌. బీజేపీ దేశంలోని అన్ని సంస్థలకు టులెట్‌ బోర్డ్‌ పెట్టిందని.. తెలంగాణలో లక్ష కంటే ఎక్కువ ఉద్యోగాలే ఇచ్చామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారని… విపక్షాలు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మిగితా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. బీజేపీ పార్టీ అంటే బట్టే బజ్ పార్టీ అని… పదవులే పరమావధిగా ఉన్న డీకే అరుణ ఇప్పుడు టిఆర్ఎస్ పై మాట్లాడుతుందని నిప్పులు చెరిగారు. ఆంధ్ర నాయకులకు ఊడిగం చేసిన డీకే అరుణ…త్యాగాల గురించి ఆమె మాట్లాడటం సిగ్గు చేటన్నారు. బండి సంజయ్ కొత్త బిచ్చగాడని.. తెలంగాణ ఉద్యమంలో అసలు ఉన్నాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ సమాజాన్ని గోస పెట్టిందని.. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అసత్యాలు మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీది అవినీతి డీఎన్ఏ అయితే.. బీజేపీది అబద్ధాల డీఎన్ఏ అని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలు కాపాడేది కేవలం టీఆర్ఎస్ పార్టీనేనని బాల్క సుమన్‌ స్పష్టం చేశారు.

Related posts