telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ పుట్టినాకే ఆవేశం పుట్టింది : బాలక్రిష్ణ

నేడు దివంగత సీఎం ఎన్టీఆర్‌ 25 వ వర్ధంతి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి బాలకృష్ణ, లక్ష్మీ పార్వతి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… “తెలుగు వారి అన్నగారు. 25వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళ్ళు అర్పించడం కుటుంబ సభ్యులుగా మా ఆనవాయితీ అన్నారు. సూర్యున్ని వేలితో చూపించడమే. ఎటువంటి పరిస్థితులకు వెదరని బెదరని మనిషి ఎన్టీఆర్. యుగ పురుషుడు. ఆయన జీవితం మనందరికి ఓ పాఠ్యమశం. ఎన్టీఆర్ పుట్టినాకే ఆవేశం పుట్టింది. ఎంతో మంది ఆధ్యాత్మికం కోసంమే కాదు.. సమాజం కోసం కూడా పోరాటం చేశారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ చేశారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అని నిరూపించారు. ప్రపంచంలోనే గొప్ప అందగాడు. ఎన్టీఆర్ సమాజంలో కొత్త ఒరవడి సృష్టించారు. ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్. కమర్షియల్ ట్రెండ్ సెట్టర్. భారత చలనచిత్ర రంగంలో నంబర్ వన్. పేదల జీవితాల్లో వెలుగును నింపారు. ఆయన ఒక ఆవేశం. పండగలకే బియ్యం తినే ప్రజలకు… కిలో రెండు రూపాయల బియ్యం అందజేశారు. తెలుగువారికి కూడు, గూడు, గుడ్డ అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యేని నేను. మా దగ్గర ఉన్న హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానస పుత్రికలు. కొట్టాడి రాష్ట్రం సాదించుకున్నాం.” అంటూ బాలకృష్ణ పేర్కొన్నారు.

Related posts