telugu navyamedia
ఆరోగ్యం

తగిన పోషకాహారంతో.. పలు సమస్యలకు చెక్.. 

proper sleep is for health and beauty
శరీరానికి తగిన పోషకాలు అందిస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉన్నట్టే అంటున్నారు వైద్యులు. అందుకే రోజు మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభించాలంటే.. పోషకాహారాలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. దీనికి తోడు ఔషధ గుణాలున్న పసుపు, అల్లం, దాల్చిన చెక్కలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. దాల్చిన చెక్క జీవక్రియలను వేగవంతం చేస్తుంది.
శరీర ఉష్ణోగ్రతను అనుగుణంగా మార్చుతుంది. టీ, కాఫీ, గ్రీన్ టీ తయారీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు జలుబు, దగ్గులాంటి రుగ్మతల నుండి దూరంగా ఉండవచ్చు. అలానే అల్లాన్ని తప్పకుండా తీసుకోవాలి. అల్లం తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జలుబు, దగ్గు దరిచేరదు. 
నువ్వుల పొడి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పొడి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఇనుము అందుతుంది. పసుపు కూడా వ్యాధులతో పోరాడుతుంది. గ్లాస్ పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం ద్వారా గొంతునొప్పి, జలుబు నయం అవుతుంది. కోడిగుడ్లను, మిరియాలను కూడా డైట్‌లో చేర్చుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Related posts