వార్తలు సినిమా వార్తలు

16 యేళ్ళ తరువాత బాలయ్యతో ఆ దర్శకుడు….

Balakrishna & VV Vinayak join hands after 16 years!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సంవత్సరాల తరువాత ఒక అగ్ర దర్శకుడు, ఒక అగ్రహీరో కలవబోతున్నారు. వారెవరో కాదు సంచలన దర్శకుడిగా పేరొందిన వినాయక్, బాలక్రిష్ణ. ఆది సినిమాతో దర్సకుడిగా మారి ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు తీసిన వినాయక్ బాలక్రిష్ణతో ఒకే ఒక్క సినిమా తీశారు. అదే చెన్నకేశవరెడ్డి. అప్పట్లో ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. కానీ వీరి కాంబినేషన్ మాత్రం బాగుందని ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు.

Balakrishna & VV Vinayak join hands after 16 years!

ప్రస్తుతం బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా వున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో పూర్తవుతుంది. ఈ సినిమా తరువాత బాలక్రిష్ణ బోయపాటికి అవకాశమిస్తారని, వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ భావించారు. కానీ అది జరుగలేదు. వినాయక్‌తో కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చేశారట బాలక్రిష్ణ. గత రెండు రోజుల క్రితం బాలక్రిష్ణ స్వయంగా వినాయక్‌కు ఫోన్ చేసి కథను సిద్ధం చేయమని చెప్పాడట. దీంతో వినాయక్ ఒక మంచి కథను సిద్థం చేస్తున్నాడట. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

 

Related posts

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌…

chandra sekkhar

బీజేపీ పాలిస్తున్న రాష్ట్రంలో భారీగా ‘ఐ లవ్ పాకిస్థాన్’ అంటూ..

jithu j

అల్లు అర్జున్-త్రివిక్రమ్… నిర్ణయం ఖరారు…

chandra sekkhar

Leave a Comment