telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

బాలయ్య అమ్మవారి దర్శనానికి బ్రేక్..

Bala krishna comments ys jagan

సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విశాఖ జిల్లాలోని ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం ఇక్కడి ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి బాలకృష్ణ వస్తున్నారన్న సమాచారంతో ఆయన్ని చూడడానికి అభిమానులు తరలివచ్చారు. అయితే పోలీసులు అనుమతించలేదని, బాలకృష్ణ రావడం లేదని తెలియడంతో వారు నిరాశ చెందారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో భద్రతా కారణంగా పోలీసులు అనుమతించలేదు.

ప్రస్తుతం ఏవోబీలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నాయి. జీకేవీధి మండలంలో మావోయిస్టులు ఎన్నికల లెక్కింపు ముగిసేలోపు ఏదో ఒక సంఘటనకు పాల్పడతారన్న ముందస్తు సమాచారం ఉండడంతో బాలకృష్ణ రావడానికి పోలీసులు అనుమతించలేదని తెలిసింది. ఏటా బాలకృష్ణ ఏదో ఒక సమయంలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం తుని నుంచి ఒక బృందం ధారాలమ్మ ఆలయానికి వచ్చి బాలకృష్ణ రానున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

Related posts