telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నాకు తెలియదు… బాలయ్య సంచలన వ్యాఖ్యలు

Balakrishna

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్ పెద్దల భేటీపై హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు తనకు తెలియదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సినిమా షూటింగులు ప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో చర్చల విషయం పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తెలుసుకున్నట్లు చెప్పారు. జూన్‌లో షూటింగులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. షూటింగ్‌ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని కోరారు. ఎక్కువ శాతం షూటింగ్‌లు ప్రారంభమైన చిత్రాలకు త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. షూటింగ్‌ సమయంలో సామాజిక దూరం పాటించాలని బాలయ్య స్పష్టం చేశారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Related posts