telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మీరు కన్న కలలు నిజం చేస్తా: బాలకృష్ణ

Balakrishna

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు. మరణం లేని జన్మ మీదంటూ.. ప్రతి జన్మలోను మీ బిడ్డగా జన్మించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

మీ కడుపున జన్మించడం నేను చేసుకున్న గొప్ప పుణ్యం. మీ ఆశయ సాధనే నా జీవిత గమ్యం ..మరణం లేని జననం మీది…జోహార్ ఎన్టీఆర్….మీరే నాకు దైవం, స్పూర్తి, గురువు. ప్రతిజన్మలోను మీ బిడ్డగా జన్మించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ..’మీరు కన్న కలలు నిజం చేస్తానని పేర్కొంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు.

Related posts