telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అసెంబ్లీ అడ్రస్ మర్చిపోయిన .. ఎమ్మెల్యే..

Balakrishna

చంద్రబాబునాయుడు బావమరది కమ్ వియ్యింకుడుగా బాలయ్య బాబు అనంతపురం జిల్లాలోని హిందుపురం నియోజకవర్గంలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎంత హాటు హాటుగా జరుగుతున్నాయో అందరూ చూస్తున్నదే. ఇటువంటి సమయంలో బావయ్య చంద్రబాబుకు అండగా ఉండాల్సిన బావమరది బాలయ్య అడ్రస్సే కనబడటం లేదు. విషయం ఏదైనా కానీయండి చంద్రబాబు అధికారపార్టీ సభ్యులను దుమ్ము దులిపేస్తున్నారు. పార్టీ తరపున గెలిచిందే 23 మంది ఎమ్మెల్యేలు. అందులో యాక్టివ్ గా ఉంటున్నది కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే కావటంతో బాబు ఒంటెద్దు బండి చందాన భారం అంతా మోయాల్సివస్తుంది. మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నట్లు అంటే.. సొంత బావమరిది రావటంలేదు, మరి మిగిలిన వారిపై ఎలా చర్యలు తీసుకోవడం అని బాబు మానసిక వ్యధ అనుభవిస్తున్నారట.

బాలకృష్ణ ఉత్త ఎమ్మెల్యే మాత్రమే కాదు చంద్రబాబుకు బావమరిది కమ్ వియ్యంకుడు కూడా. అలాంటి బాలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పెద్దగా కనబడటం లేదు. కష్టాల్లో ఉన్న బావకు బావమరిదే అండగా నిలబడకపోతే మిగిలిన ఎమ్మెల్యే ను అనుకుని ఉపయోగమేంటి..అనే చర్చ పార్టీలోనే జరుగుతోంది. శీతాకాల సమావేశాల్లో ఏదో ఒకటి రెండు రోజులు మాత్రమే అసెంబ్లీకి వచ్చామంటే వచ్చామనిపించుకున్న బాలయ్య తర్వాత అడ్రస్సే లేరు. అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్లో కానీ లేకపోతే రచ్చలో కానీ తనవంతు బాధ్యతగా చంద్రబాబుకు అండగా నిలవాలి కదా.. మరోపక్క అసెంబ్లీకి వచ్చినా, పొరపాటున ఏదైనా నోరు జారితే దానిని కవర్ చేసుకోడానికి మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేయాల్సిన బాధ్యత కూడా బాబుదే కావటం బాలయ్య గైర్హాజరుపై రెండో కోణంగా ఆ పార్టీ వర్గాలు చెప్పుకోవడం జరుగుతుంది. మొత్తానికి బావ బాధ తీర్చలేని వాడిగానే బాలయ్య మిగిలిపోతున్నాడు.

Related posts