telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రూలర్” అంటే పోలీసు అధికారి కూడా… తెలంగాణ పోలీసులపై బాలయ్య ప్రశంసలు

Ruler

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి “రూల‌ర్” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి ట్రైల‌ర్స్, సాంగ్స్ విడుద‌ల చేశారు. ఇవి ప్రేక్ష‌కుల‌లో అంచ‌నాలు భారీగా పెంచాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ గురించి మాట్లాడారు. “ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టాలన్న ఆలోచన బోయపాటి శ్రీనుదే. ఆయన నిర్మాత కళ్యాణ్‌తో మాట్లాడగానే టైటిల్ ఓకే చేశారు. రూలర్ అంటే కేవలం రాజే కాదు. ఒక పోలీసు అధికారి కూడా రూలరే. మొన్న తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతమైన పని చేశారో చూశాం కదా. ఓ మహిళను అన్యాయంగా రేప్ చేసి చంపేస్తే పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌లో లేపి పారేశారు. పోలీసులు వారిని ఓ స్పాట్‌కు తీసుకెళితే రాళ్లు రువ్వి దౌర్జన్యం చేశారని ఎన్‌కౌంటర్ చేసి పారేశారు. పోలీసుల రూపంలో దేవుడే వారికి శిక్ష విధించాడు. చట్టం, న్యాయం అనుకుంటే కేసు సాగుతూనే ఉండేది. అది టైం తీసుకున్నా సరే పోలీసులు స్పాట్‌లో జడ్జిమెంట్ ఇచ్చారు. నేను నటించిన ‘సింహా’ సినిమాలో కూడా నయనతార ఇలాంటి డైలాగ్ చెబుతుంది. ‘ఆయన ఎన్‌కౌంటర్లు చేయడం ఎప్పుడో మొదలుపెట్టారు’ అని. ఇవాళ పోలీసులు చేసింది కూడా అదే. వారిని నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పోలీసు గెటప్‌కు రూలర్ అనే టైటిల్ మ్యాచ్ అయింది’ అని తెలిపారు.

Related posts