telugu navyamedia
telugu cinema news trending

నాగబాబు కౌంటర్ పై బాలయ్య స్పందన

NagaBabu Shocking Comments on Balakrishna

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని చేసిన కామెంట్ టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. నాగబాబు, బాలయ్యను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఆ తరువాత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు అలా 5 వీడియోలను విడుదల చేసి బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు నాగబాబు. చివరగా మరో వీడియోను విడుదల చేసి ఈ వివాదాన్ని ఆపేస్తానని స్పష్టం చేశారు. తాజాగా నాగబాబు వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.

“ఎన్టీఆర్” బయోపిక్ విడుదల నేపధ్యంలో తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా థియేటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నామని, ఈ బయోపిక్ తో తండ్రి ఋణం తీర్చుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి నాగబాబు కౌంటర్ విషయాన్ని ప్రస్తావించగా “నో కామెంట్” అంటూ బదులిచ్చాడు బాలయ్య.

Related posts

సాయి తేజ్ కు ఊరటనిస్తున్న “చిత్రలహరి” వసూళ్ళు

ashok

ఆరేకాలనీలో మెట్రో కార్‌షెడ్‌ ప్రాజెక్టు .. నిలిపివేత..

vimala p

గంభీర్ పై .. ఎఫ్ఐఆర్ ..

vimala p