telugu navyamedia
సినిమా వార్తలు

మనవడితో బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్

june 10 balakrishna birthday

నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ 59వ జ‌న్మ‌దినోత్స‌వాన్ని ఆయ‌న అభిమానులు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. మ‌న‌వ‌డు దేవాంశ్‌తో బాల‌య్య కూడా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. మ‌న‌వ‌డి స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేశారు. బాల‌య్య‌కు దేవాంశ్ కేక్ తినిపిస్తున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న కొత్త సినిమా గురించి ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అభిమానులు ఆశించారు. అయితే బాల‌య్య కొత్త సినిమా గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాక‌పోవ‌డం అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. అయితే ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్‌, నిర్మాత సి.క‌ల్యాణ్ బాల‌య్య‌ను క‌లిసి జ‌న్మ‌దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కేఎస్ ర‌వికుమార్‌తో బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

Related posts