telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

నేనే ముఖ్యమంత్రి .. అంటున్న బాలయ్య..

balakrishna as cm in boyapati movie

ఒక చిత్రం విజయం వెనుక ఉన్న నేపథ్యం అదే తరహా సినిమాలు తీసేందుకు ప్రేరేపిస్తుంది. ఒకనాడు మొదలైన బయోపిక్ చిత్రాల హావా ఇంకా నడుస్తుంది. అలాగే రాజకీయ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు కూడా ఇటీవల బాగా ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో అదే తరహా సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, బాలకృష్ణ కూడా అదే తరహా చిత్రం చేసేందుకు సిద్ధం అయ్యాడు. దానికి బోయపాటి దర్శకుడట.. ఈ చిత్రంలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారట. మాస్ డైరెక్టర్ బోయపాటి శీను సినిమాలు మాస్ ప్రేక్షకులని ఏ రేంజ్‌లో అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్యతో సింహా, లెజెండ్ చిత్రాలు తీసిన బోయపాటి త్వరలో ఆయనతో మూడో చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం.

ఈ చిత్రంలో బాలకృష్ణని పవర్‌ఫుల్ సీఎం పాత్రలో దర్శకుడు చూపించనున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి మూడోవారం నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఈ చిత్రాన్ని బాలయ్య తన సొంత ప్రొడక్షన్ సంస్థ ఎన్బీకేపై నిర్మించనుండడం విశేషం. త్వరలోనే ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ సినిమాతో హ్యట్రిక్ కొట్టాలని బోయపాటి, బాలయ్య భావిస్తున్నారు. మరోవైపు తన తండ్రి ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో చేస్తున్న మహానాయకుడు చిత్రంలోను బాలయ్య సీఎం పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Related posts