telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్యతో క్రిష్ గొడవ… స్పందించిన క్రిష్…

Balakrishna-with-krish

గత నాలుగైదు రోజులుగా బాలకృష్ణకు, క్రిష్ కు మధ్య గొడవ అంటూ వార్తలు వస్తున్నాయి. బయోపిక్ ను రెండు భాగాలుగా తీయాలనే ఆలోచనతో సినిమాను చెడగొట్టాడు అనే ప్రచారం జరుగుతోంది. “మహానాయకుడు” రేపే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న క్రిష్ బాలకృష్ణతో గొడవ గురించి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ “నేను ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్ట్ లోకి వచ్చేసరికే రెండు పార్టులుగా సినిమా తీద్దామని ఆలోచన ఉంది. బాలయ్య ఆ విషయం నాకు చెప్పడంతో నేను కూడా ఓకే చెప్పేశాను. ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని ఒక పార్ట్ గా, పొలిటికల్ లైఫ్ ను ఒక పార్ట్ గా తీద్దామని బాలకృష్ణ చెప్పారు” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక సినిమాలో నలభై శాతం బాలకృష్ణ డైరెక్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా… స్పందించిన క్రిష్ “అలాంటిదేమీ లేదు. బాలయ్య దర్శకుడి విషయంలో వేలు పెట్టరు. అంతేకాదు నాకు, బాలయ్యకు ఎలాంటి విభేదాలు రాలేదు. అసలు ఇలాంటి రూమర్స్ ను ఎవరు ప్రచారం చేస్తున్నారో అర్థం కావట్లేదు… ఇప్పటికి ఇద్దరం మంచి స్నేహితులం” అన్నారు. ఖచ్చితంగా సినిమా రెండవ భాగం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు క్రిష్. మొదటిభాగమైన “కథానాయకుడు” అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. మరి రెండవ భాగమైన ” మహానాయకుడు” అయినా హిట్ అవుతుందేమో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Related posts