telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ ?

no more movies in near future by balakrishna

“సింహా, లెజెండ్’’ సినిమాలతో వరుస హిట్స్ సాధించిన బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాతో హాట్రిక్ విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు ఈ మాస్ డైరెక్టర్, నందమూరి నటసింహం. ఇప్పటికే అన్ని హంగులతో బాలకృష్ణ కోసం బోయపాటి ఓ పదునైన స్క్రిప్ట్ రెడీ చేశారు. రాజకీయ నేపథ్యంలో తయారు చేసిన ఈ స్క్రిప్ట్‌కి భారీ హంగులు జోడించి ఎన్నికల వేళ ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేశారు బోయపాటి. కానీ డేట్స్ సర్దుబాటు కానందున ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేకపోయారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు ముగియడం కారణంగా ఈ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారట బోయపాటి. కొన్ని మార్పులతో ఈ స్క్రిప్ట్ ని మెరుగుదిద్దడం కోసమై ఆయన బాలయ్యను మూడు నెలల సమయం అడిగారట. మరోవైపు ఈ సినిమా కోసం బాలకృష్ణ కూడా కొత్త లుక్ లోకి మారబోతున్నారు. ఈ సినిమాలో సరికొత్త గెటప్పుల్లో దర్శనమిచ్చేందుకు బాలయ్యబాబు దాదాపు 20 కిలోల బరువు తగ్గనున్నారు. చిత్రాన్ని సెప్టెంబర్‌లో సెట్స్ పైకి తీసుకొచ్చి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా బాలయ్య- బోయపాటి సినిమా అనే టాక్ వచ్చినప్పటి నుంచే మాస్ ఆడియన్స్‌లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

Related posts