telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బాలయ్య .. మళ్ళీ బోయపాటికే..

balakrishna 106th movie with boyapati

సీనియర్ డైరెక్టర్ కే.ఎస్.రవి కుమార్ తో నందమూరి బాలకృష్ణ తన 105 వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే . సి కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలయ్య కు జోడిగా సోహాల్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే తన 106 వ సినిమాను ఫిక్స్ చేశాడు. బాలయ్య నెక్స్ట్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అంతా సిద్ధం అయ్యింది.

ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీంద్ర నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం బోయపాటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్నాడు. బాలయ్య – బోయపాటి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. సింహ సూపర్ హిట్ అవ్వగా లెజెండ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts